నటి సమంత ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. రోజుకో వీడియో, ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది. నిన్న జిమ్‌లో స్టంట్ వీడియో షేర్ చేసిన సామ్.. తాజాగా ఎముకలు కొరికే చలిలో ఐస్ బాత్ చేసిన వీడియోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. 4డిగ్రీల చలిలో 6నిమిషాల పాటు ఐస్ బాత్ చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.