తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలలో దిల్ రాజు ప్యానెల్ విజయం సాధించింది. తాజాగా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఇక ప్రెసిడెంట్గా సంతకం చేసిన అనంతరం ఆయనకు ప్యానెల్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఫిలిం ఛాంబర్ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు, కార్యదర్శిగా దామోదర ప్రసాద్, కోశాధికారిగా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు.