తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా మొన్నటి వరకు వెకేషన్ లో రచ్చ చేసింది. గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. ఇక తాజాగా ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది. యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా ప్రస్తుతం వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. భారీ చిత్రాల్లో కాకపోయినా ద్వితీయ శ్రేణి హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మాత్రం అలరించేందుకు ప్రయత్నిస్తోంది. పదేళ్లకు పైగా ఈషా రెబ్బా ఇండస్ట్రీలో ఉంటున్న విషయం తెలిసిందే. కానీ ఈ ముద్దుగుమ్మకు అప్పటి నుంచి సరైన అవకాశం అందలేదు. ఇప్పటికి మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. కానీ చిన్న సినిమాలకే ఈ బ్యూటీ పరిమితం అవుతోంది. దీంతో నెమ్మదిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్ లోనూ మెరుస్తూ కట్టిపడేస్తోంది.బ్లూ చుడీదార్ లో ఈషా రెబ్బా బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. క్యూట్ గా ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంది. కొంటె చూపులు, చిరునవ్వుతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో చాలా బాగుంటావంటూ కామెంట్లు సైతం పెడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
Beautiful #Esharebba pic.twitter.com/FMIkVZMMPc
— VD bulletin (@vdbulletin) August 1, 2023