విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ‘96’ మూవీ సంచలనం సృష్టించింది. రూ.50 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఈ తమిళ సినిమాకు ఇతర భాషల్లోనూ ప్రేక్షకులు ఆదిరించారు. 96 మూవీ దర్శకుడు ప్రేమ్ కుమార్ చంద్రన్ మేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా ఈ దర్శకుడు హీరో కార్తీతో కలిసి సినిమా చేయబోతున్నాడు. మధురై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీతోపాటు అరవింద్ స్వామి కీలకపాత్రలో నటించనున్నారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.