నటుడు తరుణ్ పెళ్లి గురించి కొద్ది రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ సోషల్మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. నిజంగానే పెళ్లి ఫిక్స్ అయితే తానే స్వయంగా ఆ శుభవార్తను అందరితో పంచుకుంటానని స్పష్టం చేశారు.