స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్, సుధీప్, తమన్నా వంటి ప్రముఖ తారాగణంతో పాటు మెగా డాటర్ కొణిదల నిహారిక కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే సైరా చిత్రంలో ఓ గిరిజన యువతిగా కనిపించనున్న నిహారిక రెండు సీన్స్ లో కనిపిస్తోందట. అయితే ‘సైరా నరసింహారెడ్డి’కి ఓ ఆపద సమయంలో ఆశ్రయం ఇచ్చే యువతిగా నిహారిక నటిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే నిహారికకు సంబధించిన సీన్స్ ను షూట్ చేసారు.
ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదీ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa