ప్రముఖ బాలీవుడ్ నటి మాళవిక రాజ్ నిశ్చితార్థం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గాతో టర్కీలో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఆమె నెట్టింట పోస్ట్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఫోటోను షేర్ చేస్తూ.. ‘మా ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించాం. మా బంధం మరింత బలంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అందరి ఆశీర్వాదాలు కావాలి.’ అని రాసుకొచ్చింది. దాంతో పెద్దఎత్తున అభిమానులు, సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.