ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రైలర్ టాక్ : హార్రర్ అండ్ థ్రిల్లర్ 'విశ్వామిత్ర'

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 25, 2019, 02:46 PM

తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రాలలో 'గీతాంజలి' .. 'త్రిపుర' చిత్రాలు మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి. ఈ రెండు చిత్రాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న రాజకిరణ్, తాజాగా మరో హారర్ థ్రిల్లర్ సినిమాను రూపొందిస్తున్నాడు. నందితా రాజ్ ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, 'విశ్వామిత్ర' అనే టైటిల్ ను ఆయన ఖాయం చేసుకున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరి కాంబినేషన్స్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. సస్పెన్స్ .. హారర్ నేపథ్యంలో సీన్స్ నే ఈ ట్రైలర్లో ఆవిష్కరించారు. 'అతను సీసీ కెమెరాలో ఎందుకు రికార్డు కాలేదో నాకు అర్థం కావడం లేదు' .. 'చచ్చినోడు బతికొచ్చి నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశాడంటే నమ్మడానికి నేను పిల్లోణ్ణి కాదు .. పోలీసోణ్ణి' అనే డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమైన పాత్రల్లో అశుతోష్ రాణా .. ప్రసన్న .. సత్యం రాజేశ్ .. జీవా కనిపిస్తున్నారు. వచ్చేనెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa