టాలీవుడ్ నటి ఇలియానా తల్లి అయ్యారు. ఆగస్టు 1న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చిన్నారి ఫోటోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులకు పంచుకున్నారు. ఇలియానా తన బిడ్డకు ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అని నామకరణం కూడా చేశారు. ఈ పోస్టు చూసిన పలువురు నెటిజన్లు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆమెకు అభినందనలు చెబుతున్నారు.