ప్రస్తుతం తాప్సీ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. కాగా తాప్సీ కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం మూవీతో తాప్సీ హీరోయిన్ అయ్యారు. ఇటీవల మిషన్ ఇంపాజిబుల్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి అక్కడే సెటిల్ అయ్యారు .తాప్సీ పన్ను చీరలో గుమ్ముగా తయారయ్యారు. నడుము మడతలు హైలెట్ అయ్యేలా క్రేజీ యాంగిల్ నుండి ఫోటో దిగారు. తాప్సీ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుండగా, సోషల్ మీడియా షేక్ అవుతుంది. మరోవైపు వరుస చిత్రాలతో తాప్సీ హోరెత్తిస్తున్నారు. భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా శబాష్ మిథు తెరకెక్కింది. తాప్సి టైటిల్ రోల్ చేశారు. ఇక ప్రొఫెషనల్ క్రికెటర్ లా కనిపించడం కోసం తాప్సీ చాలానే కష్టపడ్డారు. బరువు తగ్గడంతో పాటు జిమ్ లో కఠిన కసరత్తులు చేశారు.