ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో భార్య.. విదేశాల్లో గుండెపోటుతో మృతి

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2023, 03:04 PM

ఏ నిమిషానికి ఏం జరుగునో అనేది మొన్నటి మాట.. ఇప్పుడు కాలం మారింది.. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అతనో సినిమా హీరో.. చక్కనైన కుటుంబం..భార్య, పిల్లలతో ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే హీరో.. కొంచెం రిలాక్స్ కోసం.. భార్యతో కలిసి విదేశాలకు విహార యాత్రకు వెళ్లాడు. సరదా కాస్తా.. విషాధంగా మారింది.ఎంతో అపురూపంగా ప్రేమించిన భార్య.. కార్డియాక్ అరెస్ట్.. తీవ్ర గుండెపోటుతో తన కళ్ల ముందే కన్నుమూసింది. అప్పటి వరకు ఎంతో జాలీగా.. హ్యాపీగా ఉన్న ఆ హీరో.. భార్య కళ్ల ఎదుట నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి కుప్పకూలాడు. ఈ విషాధ ఘటన జరిగింది.. కన్నడ హీరో, దర్శకుడు విజయ్ రాఘవేంద్ర ఇంట్లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


 


విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందనకు గుండెపోటుతో రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లుగా నిర్థారించారు. ఈ వార్త మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమకు షాకింగ్ కు గురిచేసింది. ఆమె భౌతికకాయం రేపు ఆగస్టు 08న బెంగళూరుకు చేరుకుంటుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్పందనకు ముందుగా బీపీ తగ్గి గుండెపోటుకు దారి తీసిందని తెలుస్తోంది. అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.


 


విజయ రాఘవేంద్ర-, స్పందన ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2007ఆగస్టు 26 నవివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ శౌర్య అనే కొడుకు ఉన్నాడు. వీరి 16వ వివాహ వార్షికోత్సవానికి మరో19 రోజుల ముందు ఈ విషాదం చోటుచేసుకుంది. రిటైర్డ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ బీకే శివరామ్ కుమార్తె స్పందన. విజయ్ రాఘవేంద్ర కన్నడ సినిమాల్లో నటుడిగా దర్శకుడిగా కొనసాగుతున్నారు. 2016లో విడుదలైన అపూర్వ సినిమాలో స్పందన అతిథి పాత్రలో నటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com