మెగాస్టార్ చిరంజీవి నటించిన బోళాశంకర్ మూవీకి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నెల 11న రిలీజ్ కానున్న భోళాశంకర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది. దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందంటూ చిరు అభిమానులు ఆరోపిస్తున్నారు.