సింగర్ గా చిన్మయికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సింగర్ కంటే కూడా మీటూ ఉద్యమంతోనే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిందని చెప్పుకోవాలి.ఆమె తమిళ ఇండస్ట్రీలో ఎంతోమందిపై ఆరోపణలు చేసింది. వైరముత్తు లాంటి దిగ్గజాన్ని ఢీకొట్టి మరీ నిలబడింది. ఎంతోమంది సింగర్లపై ధైర్యంగా ఆరోపణలు చేసింది.గతంలో చెప్పిన ఓ సంఘటన ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఆమె 2022లో ఈ ఘటన గురించి వివరించింది. ఆమె మాట్లాడుతూ.. నేను సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఓ గొప్ప ప్లే బ్యాక్ సింగర్ ను కలిశాను. ఆయన పాటలకు నేను పెద్ద ఫ్యాన్. అయితే ఓ సారి ఆయన నన్ను స్కైప్ లో మాట్లాడమని చెప్పాడు.
చాలా ఆనందం వేసింది. నా స్కైప్ ఐడీ నుంచి ఆయనతో వీడియో కాల్ లో మాట్లాడాను. కానీ ఆయన మాటలు విని ఆయన మీద గౌరవం పోయింది. కాల్ మొత్తం బట్టలు విప్పేసి న్యూడ్ గా మాట్లాడమని చెప్పాడు. నేను షాక్ అయిపోయాను. చాలా కోపం వేసింది. నేను అలా చేయనని చెప్పేశాను. ఈ విషయం మీడియాకు చెప్తాననే భయం కూడా లేదా అని అడిగాను.దానికి ఆయన మాట్లాడుతూ.. నువ్వు ఎవరు చెప్పినా పెద్దగా నమ్మరు. ఎందుకంటే నా మీద ఉన్న గుర్తింపు అలాంటిది అని చెప్పాడు. దాంతో కాల్ కట్ చేశాను. అప్పటి నుంచి మళ్లీ ఆయన్ను కలవలేదు అంటూ బాంబు పేల్చింది చిన్మయి. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం ఆమె అప్పుడు బయటకు చెప్పలేదు.