‘7/G బృందావన కాలనీ’. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ టీవీల్లో ప్రసారమైతే చూడని వారుండరు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. 18 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ క్లాసిక్‌ను ఇన్నేళ్ల తరువాత 4K వర్షన్లో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి తేదీని ఇంకా ఫిక్స్ చేయలేదు.