టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. నిర్మాతలు ఈ చిత్రానికి స్కంద-ది ఎటాకర్ అనే టైటిల్ ని పెట్టారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెట్లో ప్రధాన జంట మరియు డ్యాన్సర్లపై చివరి పాటను చిత్రీకరించారు. దీంతో స్కంద షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తిఅయ్యినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ రామ్, శ్రీలీల, దర్శకుడు బోయపాటి శ్రీను మరియు నిర్మాత శ్రీనివాసా చుట్టూరి కలిసి ఉన్న పోస్టర్ ని విడుదల చేసారు.
ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది. ఈ సినిమా 15 సెప్టెంబర్ 2023న విడుదలవుతోంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమా ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.