టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి చిత్ర నిర్మాతలు 'దే కాల్ హిమ్ OG' అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా ఇప్పుడు స్టేర్ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 2, 2023న ఈ సినిమా టీజర్ మరియు టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, చిత్ర నిర్మాతల నుండి అధికారిక ధృవీకరణ ఇంకా రావలిసిఉంది.
ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అమితాబ్ బచ్చన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 2023లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.