'బొమ్మరిల్లు', 'పరుగు', 'ఆరెంజ్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ భాస్కర్. అయితే 'ఆరెంజ్' సినిమా ప్లాప్ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ చాలా సంవత్సరాలు సినిమాలకి దూరంగా ఉన్నారు. దీని తర్వాత రామ్ తో కలిసి చేసిన ‘ఒంగోలు గీత’ సినిమా కూడా ప్లాప్ గా నిలించింది. చాల కలం తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అక్కినేని అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమా చేసాడు. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమాని ఎస్విసిసి బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.