తమిళ స్టార్ హీరోయిన్ తో తనకు పెళ్లి అని వస్తోన్న రూమర్స్ పై నటుడు విశాల్ స్పందించారు. అవన్నీ అబద్దాలంటూ కొట్టిపారేశారు. ‘నాపై వచ్చే ఫేక్ న్యూస్ పై స్పందించను. అయితే, ఇప్పుడు లక్ష్మీ మేనన్ తో నా పెళ్లి అని రూమర్స్ వచ్చినందున నిర్మొహమాటంగా ఖండిస్తున్నాను. ఓ అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి ఇలా చెప్పి ఆమె ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. టైం వస్తే నా పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తా.’అని విశాల్ తెలిపారు.