సాయిపల్లవి అంటే కుర్రాళ్లలో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ఆమెకు ఈ జనరేషన్ లో ఏ హీరోయిన్ కు లేనంత ఫాలోయింగ్ ఉంది.ఎందుకంటే ఆమె ఎలాంటి గ్లామర్ షోలు చేయదు. కేవలం తన పాత్రలో ఒదిగిపోయి నటిస్తుంది. పైగా ఇప్పటి సినిమాల్లో ఏ హీరోయిన్ కూడా సాయిపల్లవి లాగా మేకప్ లేకుండా మొటిమలతో నటించదు.ఎలాంటి లిప్ లాక్ లు ఇవ్వదు. వల్గర్ సీన్లు కూడా చేయదు. పద్ధతిగా ఉండే హీరోయిన్ అనే పేరుంది. అందుకే
సాయిపల్లవి కు లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చేసింది. అయితే ఇంతటి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోయిన్ మన తెలుగు హీరోకు వీరాభి మాని. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆమెనే వెల్లడించింది.నేను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పెద్ద అభిమానిని. ఇంటర్ చదువుకునే రోజుల్లో ఆయన సినిమాలు చూసేందుకు ఓ రోజు ఇంట్లో చెప్పకుండా థియేటర్ కు వెళ్లాను. ఒక్కదాన్నే వెళ్లడంతో ఇంటికి వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది. దాంతో మా నాన్న నన్ను కొట్టాడు. మాకు చెబితే మేమే తీసుకెళ్తాం కదా అన్నాడు మా నాన్న.నాకు ఇష్టమైన హీరో కోసం నేను తీసుకున్న రిస్క్ అదొక్కటే. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక ఆయన్ను నేరుగా కలిసే అవకాశం వచ్చింది. ఫిదా సినిమా షూటింగ్ లొకేషన్ కు ఓ సారి పవన్ కల్యాణ్ వచ్చారు. అప్పుడే మొదటిసారి ఆయన్ను కలిశాను. ఆయన ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి అంటూ తన సంతోషాన్ని తెలిపింది సాయిపల్లవి.