కన్నడ నటుడు ఉపేంద్రపై కేసు నమోదైంది. తన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా సోషల్మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘ప్రజాకీయా’ వార్షికోత్సవంలో భాగంగా ఉపేంద్ర శనివారం ఫేస్బుక్, ఇన్స్టా లైవ్ నిర్వహించారు. విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ ఆయన సామెతలు చెప్పారు. ఈ క్రమంలో ఉపేంద్ర వ్యాఖ్యలు తమని ఆవేదనకు గురి చేశాయంటూ కొందరు బెంగళూరులోని చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.