అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ ఎవడు, 2.0, ఐ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో నటించిన 2.0 చిత్రమే అమీ జాక్సన్ చివరి చిత్రం. ఆ తర్వాత జాక్సన్ మరే మూవీలోనూ నటించలేదు. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో సహజీవనం మొదలు పెట్టడమే. లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో అమీ జాక్సన్ ప్రేమలో పడింది. వీరిద్దరి సహజీవనం ప్రారంభించారు. 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు.
కొంత కాలానికి అమీ జాక్సన్ జార్జ్ తో పెళ్లి కాకుండానే విడిపోయింది. కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న ఈ మెరుపుతీగ.. ఆ తర్వాత కొత్త ప్రియుడిని వెతుక్కుంది. ప్రస్తుతం అమీ జాక్సన్ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్వీక్ తో రిలేషన్ లో ఉంది. ఇదిలా ఉండగా అమీ జాక్సన్ బ్రిటిష్ మహిళ అయినప్పటికీ ఇండియాలో నటిగా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుంది.
2010లో 1947 ఎ లవ్ స్టోరీ ( మద్రాసు పట్టణం) చిత్రంతో అమీ జాక్సన్ డెబ్యూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆర్య సరసన ఎమోషనల్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఈ మెరుపు తీగకి అనేక అవకాశాలు వచ్చాయి. శంకర్ 2.0, ఐ చిత్రాల్లో నటించింది. రాంచరణ్ సరసన ఎవడులో మెరిసింది. నిన్న ఇండియా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమీ జాక్సన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
'హ్యాపీ ఇండిపెండెన్స్ డే, ఇంక్రెడిబుల్ ఇండియా.. నానా మొదటి చిత్రం మద్రాసు పట్టణంతో ఈ అందమైన దేశంలో తిరిగే అవకాశం లభించింది. ఈ అవకాశం కల్పించిన దర్శకుడు ఏఎల్ విజయ్ కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ రోజు నుంచి ఇండియా నా రెండవ ఇల్లు గా మారిపోయింది. అక్కడ నాకు ఏర్పడ్డ స్నేహితులు కుటుంబ సభ్యులుగా మారారు.