ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోర్టు మెట్లెక్కారు. ఇటీవల ప్రజాకీయ పార్టీని నెలకొల్పి ఆరేళ్లయిన నేపథ్యంలో ఉపేంద్ర మాట్లాడుతూ.. ఒక కన్నడ సామెతను ఉటంకించారు. ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆయనపై దళిత సంఘాలకు చెందిన నేతలు వివిధ స్టేషన్లలో కేసులు పెట్టారు.