విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం ఖుషి. సెప్టెంబర్ 1 న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమాలో విజయ్-సమంత మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇక ఖుషి టీం సినిమా ప్రొమొతిఒన్స్ లో బిజీ అయిపోయింది. ఆగష్టు 15 న విజయ్- సమంత స్టేజిపైనే డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇక విజయ్ స్టేజి మీదే షర్ట్ తీయడం, స్పీచ్ తో అదరగొట్టాడు. విజయ్ దేవరకొండ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గీతాగోవిందం తరువాత ఒక ఫామిలీ సినిమాతో వస్తున్నారు. ఇక సమంత కూడా సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది.
ఈ క్రమంలో సమంతకి ఒక యూట్యూబ్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సమంతకి విజయ్ గురించి ఒక ప్రశ్న వచ్చింది. విజయ్ ఎలాంటి భార్య కావాలి అని అడగగా, సమంత స్పందిస్తూ ఆమె చాలా సాధారణంగా ఉండాలి. అతడి కుటుంబంతో కలిసిపోవాలి' అని తెలిపారు. ఈ సమాధానాలకు విజయ్ కూడా కరెక్ట్ అంటూ స్పందించారు. అంతేకాదు సమంత మాట్లాడుతూ విజయ్ కి చాలా మంది స్నేహితులు ఉన్నారని, ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడాడని, చాలా తక్కువగా మాట్లాడుతాడని, కానీ మెసేజ్ లు ఎక్కువగా చేస్తుంటాడని, విజయ్ బాగా నచ్చిన చిత్రం బేబీ అని, విజయ్ ఎక్కువగా గేమింగ్ యాప్ లు వాడుతుంటాడని సమంత చెప్పింది.
ఆగష్టు 15 న జరిగిన ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడ్డారని, సినిమా విడుదలయ్యాక సమంత మొఖంలో నవ్వు చూడాలని ఉందని విజయ్ అన్నాడు. రాహుల్ రవీంద్రన్, చిన్మయి, నీరజ కోన, మేఘన.. వీళ్లు సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఈ ఈవెంట్ లో స్టేజి మీద విజయ్-సమంత డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ని అలరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా ముందు విజయ్, సమంత కలిసి మహానటి సినిమాలో నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా, ఈ సినిమా కూడా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని ఆశిస్తున్నారు. సెప్టెంబర్ 1 న ఖుషిసినిమా విడుదల కానుంది.