టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో జోరు మీద ఉంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగుతోంది. ఈ క్రమంలో తాజాగా బ్యూటీఫుల్ పిక్స్ ను పంచుకుంది. ‘డీజే టిల్లు’తో యంగ్ హీరోయిన్ నేహా శెట్టి మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తన పెర్ఫామెన్స్ తో దుమ్ములేపింది. గ్లామర్ మెరుపులు మెరిపించి కూడా ‘రాధిక’గా గుర్తింపు పొందింది. యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది.ప్రస్తుతం మరో మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. యంగ్ హీరో కార్తీకేయ సరసన ‘బెదురులంక 2012’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో జోరు పెంచారు. అటు మాస్ కా దాస్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లోనూ నటిస్తోంది. ఈ చిత్రం నుంచి నిన్న విడుదలైన ‘సుట్టమ్లా సూసి’ సాంగ్ మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నేహా అందాల విందుకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో నేహా సోషల్ మీడియాలోనూ ఎక్కువగా కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ అదరగొడుతోంది. ఈ క్రమంలో నయా లుక్ లో మెరిసింది. తాజాగా నేహా ఆరెంజ్ డ్రెస్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. క్లోజప్ షార్ట్ లో ఫొటోలకు అందంగా ఫోజులిచ్చి మంత్ర ముగ్ధులను చేసింది. గుచ్చే చూపులతో యంగ్ బ్యూటీ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
#NehaShetty pic.twitter.com/myB8DF0vFr
— VD bulletin (@vdbulletin) August 17, 2023