తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ 7/G రెయిన్బో కాలనీ సినిమాతో ఒక మేజిక్ ని సృష్టించాడు. ఈ సినిమా తెలుగులో 7/G బృందావన్ కాలనీ అనే టైటిల్ తో విడుదలైంది. రవికృష్ణ మరియు సోనియా అగర్వాల్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం 2004లో విడుదలయ్యింది. తాజగా ఇప్పుడు డాల్బీ అట్మాస్ సాంకేతికతతో ఈ సినిమా యొక్క 4K వెర్షన్ సెప్టెంబర్ 22, 2023న థియేటర్లలో గ్రాండ్ రీ-రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ కల్ట్ ఫిల్మ్ కి యువన్ శంకర్ రాజా అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను అందించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.