ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాల వివాహ తేదీ ఖరారు అయింది. సెప్టెంబర్ 25న వీరి వివాహం రాజస్థాన్ ఉదయపూర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరగనుంది. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత గురుగ్రామ్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఢిల్లీలో మే 13న వీరికి నిశ్చితార్థం జరిగింది.