తన జీవితంలో మరచిపోని ఒక సంఘటన గురించి ‘తీన్మార్’ నటి కృతి కర్బందా తాజాగా మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘నేను నటించిన ఓ కన్నడ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. హోటల్లో పనిచేసే ఒక వ్యక్తి నా రూమ్‌లో సీక్రెట్‌గా కెమెరా పెట్టాడు. చెక్ చేసుకునే క్రమంలో నా రూమ్‌లో కెమెరాని గుర్తించాం. ఇక బయట ఎక్కడైనా బస చేయాల్సి వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా’’ అని ఆమె చెప్పుకొచ్చారు.