మెగాస్టార్ చిరంజీవి 68వ పడిలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ చిరుకు బర్త్ డే స్పెషల్ విషెస్ చెప్పాడు. తన కూతురు క్లీంకారాతో ఉన్న చిరంజీవి ఫోటోను షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. ‘మా ప్రియమైన చిరుత (చిరంజీవి తాత)కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని చరణ్ తన కూతురు తరఫున బర్త్ డే విషెస్ తెలిపాడు.