ఓ వ్యక్తిని పిచ్చిగా ప్రేమించానని, అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని నటి కిరణ్ అన్నారు. అయితే తన ప్రేమ ఫెయిల్ అయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మనసు ముక్కలైందని, అందుకే సినిమాలకు దూరమయ్యానని కిరణ్ అన్నారు. కోలీవుడ్‌లో విక్రమ్, అజిత్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోల సరసన కిరణ్ నటించారు. ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘లియో’ చిత్రంలో కిరణ్ నటిస్తున్నారు.