ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతిలోక సుందరి సినిమా జపాన్ లో విడుదల అవుతుంది

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 11:07 AM

లెజెండరీ నటి శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘మామ్’ చైనాలో కూడా విడుదల కాబోతోందని ఆమె భర్త బోనీ కపూర్ తెలిపారు. రవి ఉద్యావర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. 2017లో ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించింది. దాదాపు రూ.370 కోట్లతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లు వసూలు చేసిందని విశ్లేషకులు అంచనా వేశారు.

ఈ సినిమా విషయమై బోనీ మాట్లాడుతూ.. ‘‘మామ్‌’ సినిమా ప్రతి ప్రాంతంలోని తల్లులకు, ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది. ఇది శ్రీ చివరి సినిమా. ఈ అందమైన కథను అందరికీ చెప్పి, ఆమె చివరి మధురమైన సినిమాను వీలైనంత మందికి చూపించాలనేదే మా ఉద్దేశం’ అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని మార్చి 22న చైనాలో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa