సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఓ సన్నివేశంలో ఆర్సీబీ జెర్సీని ధరించిన ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ను రజనీకాంత్ హతమారుస్తాడు. దీనిపై సదరు క్రికెట్ టీమ్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో సెప్టెంబర్ 1లోపు ఆ సన్నివేశంలో మార్పులు చేస్తామని చిత్రబృందం వెల్లడించింది. అలాగే టెలివిజన్, ఓటీటీల్లోనూ మార్చిన సన్నివేశాన్ని ప్రదర్శిస్తామని తెలిపింది.