ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు కొచ్చి NIA అధికారులు నోటీసులు జారీ చేశారు. కేరళ విలన్జియం సమీపంలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఆదిలింగం వరలక్ష్మి పీఏగా పని చేశాడు. ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసిన అధికారులు, డ్రగ్స్ సరఫరాలో వచ్చిన మొత్తాన్ని నిందితుడు సినీ పరిశ్రమలో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అతనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం విచారించేందుకు వరలక్ష్మికి సమన్లు జారీ చేశారు.