హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఓ అమ్మాయి చేతిలో చేయి వేశాడు. అయితే ఫోటో కింద 'చాలా జరుగుతున్నాయి కానీ ఇది నిజంగా ప్రత్యేకమైనది' అని రాసి పోస్ట్ చేసాడు. త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తాను అని అన్నారు. దీంతో ఇది అతని పెళ్లి గురించే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 'ఖుషీ' సినిమా ప్రమోషన్ అని కొందరు అంటున్నారు.