సీనియర్ హీరోయిన్ నగ్మా తాజాగా తన వివాహంపై స్పందించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. 'నాకు పెళ్లి చేసుకోకూడదనే ఆలోచన లేదు. నాకు ఓ కుటుంబం ఉండాలనేది నా కోరిక. కాలం కలిసి వస్తే త్వరలో నా పెళ్లి జరుగుతుందేమో. ఇలా జరిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను' అని చెప్పుకొచ్చింది. గతంలో నగ్మా పెళ్లైన నలుగురిని ప్రేమించిందనే వార్తలు జోరుగా ప్రచారం అయిన విషయం తెలిసిందే.