‘తిరగబడరసామీ’మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్లోమన్నారా చోప్రాను దర్శకుడు రవికుమార్ ముద్దుపెట్టుకోవడం నెట్టింట చర్చకు దారి తీసింది. ఈ వివాదంపై తాజాగా రవికుమార్ స్పందించారు. ‘‘ఆమెను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? ఆప్యాయతతోనే అలానే చేశా. నా కుమార్తెను కూడా అలాగే ముద్దుపెట్టుకుంటా. సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడి వర్క్ చేశారు. ఆమె వర్క్ నచ్చడంతో కృతజ్ఞతగా ముద్దు పెట్టా’’ అని చెప్పారు.