అన్నాచెల్లెళ్లూ, అక్కాతమ్ముళ్ల అనుబంధానికీ అనురాగానికీ అద్దంపట్టే అపురూపమైన వేడుకే రక్షాబంధన్. కొన్ని సెలబ్రిటీల ఇంట రాఖీ పండగ సందడి. హీరో అల్లు అర్జున్ కూతురు అర్హ.. తన అన్నయ్య అయాన్‌కి రాఖీ కట్టింది. అపై అయాన్.. తన చెల్లి అర్హకు బహుమతులు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.