జాన్వీ కపూర్.. హీరోయిన్గా బిజీ అవుతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు అందుకుంటూ దూసుకుపోతుంది. కెరీర్ పరంగా కొత్త ఫేజ్‌లోకి వెళ్తుంది. అదే సమయంలో అందంతోనూ కట్టిపడేస్తుంది. జాన్వీ కపూర్.. తాజాగా రవి వర్మ గీసిన బొమ్మలా మారిపోయింది. ఆమె రవి వర్మ పెయింట్‌లా పోజులిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. రెడ్ కలర్ చేనేత కాటన్ శారీ కట్టి సిట్టింగ్ పొజిషీయన్లో కెమెరాకి పోజులిచ్చింది. ఇందులో ఆమె పరువాలకు చీర చుట్టుకుని జబ్బల టాప్ అందాలు కనిపించేలా హోయలు పోయింది.అతిలోక సుందరి శ్రీదేవి తనయ.. ఈ లేటెస్ట్ ఫోటో షూట్లో ఎంతో అందంగా ఉంది. కట్టిపడేసే చూపులతో టెంప్ట్ చేస్తుంది. రాఖీ పండుగ సందర్భంగా కిర్రాక్ పోజులతో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. నెట్టింట ఈ తాజా ఫోటోలతో రచ్చ షురూ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇందులో జాన్వీ స్పందిస్తూ, ఇది ఆర్ట్ యొక్క పనితనం అని పేర్కొంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏంజెల్లా ఉన్నావని, రవివర్మ కే సాధ్యం కాని అందం నీది అని అంటున్నారు. అతిలోక సుందరిని మించిపోతున్నావని చెబుతున్నారు. హాట్ బ్యూటీ కిర్రాక్ లుక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.