ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) సొసైటీ అధ్యక్షుడిగా, పాలక మండలి చైర్‌పర్సన్‌గా ఆర్.మాధవన్ నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసింది. మాజీ అధ్యక్షుడు డైరెక్టర్ శేఖర్ కపూర్ పదవీకాలం 2023 మార్చి 3వ తేదీతో ముగిసింది. ఆయన స్థానంలో మాధవన్ నియమితులయ్యారు.