నటి సమంతను ఉద్దేశిస్తూ గాయని చిన్మయి తాజాగా ట్విట్టర్(X)లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘ఎన్ని నిందలు ఎదురైనా హుందాగా ముందుకు ఎలా సాగాలో నేర్చుకోవాలంటే సమంతను స్ఫూర్తిగా తీసుకోండి. ‘ఈ అమ్మాయి కెరీర్ అయిపోయింది’ అని పలువురు కామెంట్ చేస్తున్న సమయంలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి తన సత్తా చాటుతోంది’’ అని ట్వీట్లో పేర్కొంది.