ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనసూయ అయితే వద్దు అంటున్న డైరెక్టర్స్.. ఎందుకంటే..!?

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 12:39 PM

యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన అనసూయ హాట్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. మొదట యాంకర్ గా చాలా షోలు చేసిన తర్వాత తనకి సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి.అలా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ ఇప్పుడు సినిమాలు చేయడంలో తన జోరు తగ్గించింది అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇక దానికి కారణం కూడా ఉంది అని అంటున్నారు. వరుసగా అనసూయ చేస్తున్న సినిమాలన్నీ కూడా ఫ్లాపులు గానే నిలుస్తున్నాయి. ఇక ఎన్ని సినిమా ఆఫర్లు ఎలా వచ్చాయో అనెంతల వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో బిజీగా అయింది అనసూయ .


అలా వరుస సినిమాలతో బిజీ కావడంతోపాటు అనసూయ ఉంటే ఆ సినిమా హిట్ అన్న క్రేజీ టాక్ కూడా మొదట్లో తనకి దక్కింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ సీన్ రివర్స్ అయింది. అనసూయ ఉంటే కచ్చితంగా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అన్న టాక్ వినబడుతోంది. అయితే అనసూయ ఎంచుకుని పాత్రలు కూడా ఏమంత ఆసక్తికరంగా ఉండవు. సెలెక్టివ్ గా ఆమె సినిమాలను ఎంచుకోదు. దాంతో మేకర్లు అనసూయని ఇప్పుడు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు అన్న గుసగుసలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. అయితే అనసూయ చేతిలో ఒక క్రేజీ ప్రాజెక్టు ఉంది.


 


అది పుష్పటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్లు వస్తున్న ఈ సినిమాలో అనసూయది కీలక పాత్ర అని చెప్పాలి. అయితే ఈ సినిమాతో అనసూయ దశ మళ్లీ తిరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఒక సినిమా కోసం ఆయన అనసూయతో గతంలో జరిగిన ప్రయత్నాలు ఇప్పుడు ఆగిపోయాయి అన్న టాక్ నడుస్తోంది. అయితే అప్పట్లో అనసూయకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద ప్రాజెక్టు కోసం అనసూయని కలిసారట. ఇక తాజా పరిణామాల నేపథ్యం ఆ దర్శక నిర్మాతలు మరొక ఆలోచన తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనసూయ ప్లేస్ ని మరొక క్రేజీ సీనియర్ నటితో రీప్లేస్ చేయాలి అన్న ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. అనసూయ ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర. కానీ అనూహ్యంగా ఇప్పుడు అనసూయను ఆ క్రేజీ ప్రాజెక్టు నుండి తొలగించినట్లుగా తెలుస్తోంది..!!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com