నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు మొదటిసారి తమ కవల పిల్లలు ఉయిర్, ఉలగ్ ల ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. వారు తమ పిల్లలతో శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవడం ఇదే మొదటిసారి కావడంతో ఇద్దరు పిల్లలకు కృష్ణుడి అలంకారం చేసి, వెనుక నుంచి ఫొటో తీసి, దాన్ని విడుదల చేశారు. ‘‘మా ఇద్దరు కృష్ణులతో ఎంతో అందమైన కృష్ణ జయంతిని, ఆశీర్వచనాల మధ్య జరుపుకుంటున్నాం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు’ అంటూ విఘ్నేశ్ ఇన్ స్టా లో పోస్ట్ పెట్టారు.