జవాన్ చిత్రంతో నయనతార బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. తాజాగా తనభర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ముంబైలోని ఓ థియేటర్లో సినిమాను వీక్షించిన అనంతరం నయనతార మీడియాతో ముచ్చటించింది. బాలీవుడ్ అరంగేట్రానికి ఇంతసమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించగా.. ‘‘దేనికైనా సరైన సమయం రావాలి. కాస్త ఆలస్యమైనా నా అభిమాన హీరో షారుఖ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చింది.