మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి చెల్లెలు అమీనా (70) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాదే మమ్ముట్టి తల్లి మరణించగా. ఇప్పుడు తన చెల్లెలు కూడా మరణించడంతో మమ్ముట్టి కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది. అమీనాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మరణం పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.