టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి ‘రూల్స్ రంజన్’గా వచ్చేస్తున్నాడు. ఈ సినిమాలో కిరణ్ జోడీగా నేహా శెట్టి అలరించనుంది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలిపారు. అందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దివ్యాంగ్ - మురళీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు.