సినీ నటి గౌతమి పోలీసులను ఆశ్రయించింది. రూ.25కోట్లు విలువ చేసే తన భూమిని కొందరు కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భూమిని వదులుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంది. తమిళనాడులో రూ.50కోట్లు విలువచేసే భూములు గౌతమికి ఉన్నాయి. ఈమధ్య ఆమె ఆరోగ్యం బాగాలేకపోవడంతో వాటిని అమ్మాలని గౌతమి నిర్ణయించుకుంది. ఈక్రమంలో ఓ కాంట్రాక్టర్ తన సంతకాలు ఫోర్జరీ చేసి, భూమిని కాజేశారని చెప్పుకొచ్చింది.