ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్ట్‌ 2 కి సిద్ధమైన 7/జీ బృందావన కాలనీ చిత్ర బృందం

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 04:05 PM

ఎ.ఎం.రత్నం నిర్మాణంలో ఆయన తనయుడు రవికృష్ణ హీరోగా  2004లో సంచలనం సృష్టించిన చిత్రం '7/జీ బృందావన కాలనీ’. ఈ చిత్రంలో  సోనియా అగర్వాల్‌ కథానాయిక. సెల్వ రాఘవన్‌ దర్శకుడు. ఇప్పుడీ చిత్రం రీ రిలీజ్‌కు సిద్థమైంది. డిజిటలైజ్‌ చేసి 4కే వెర్షన్‌లో ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ.....  ‘‘రీ రిలీజ్‌ ట్రైలర్‌ చూస్తుంటే అప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఇందులో హీరో పాత్రకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యా. ఇప్పటి వరకూ ఈ చిత్రాన్ని ఒక్కసారే పూర్తిగా చూశా. ఎందుకంటే, క్లైమాక్స్‌ చూడటం నా వల్ల కాదు. ఒకవేళ సినిమా చూేస్త నేను ఆ పాత్రలోకి వెళ్లిపోతా. షూటింగ్‌ చేస్తున్నప్పుడు కూడా.. ఓ రోజు ఇంట్లో నిరాశగా ఏదో ఆలోచిస్తూ కూర్చొన్నా. నన్ను అలా చూసి మా అమ్మ షాకయ్యారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పార్ట్‌ 2 తీస్తున్నాం’’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa