టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు గురించి చిత్ర పరిశ్రమలో ఎక్కువమంది స్పందించటం లేదు అని మీడియా అడిగిన ప్రశ్నలకి , సురేష్ బాబు స్పందిస్తూ..... పరిశ్రమకి చాలామంది చాలా చేశారు అని చెప్పారు. "మా నాన్నగారు (రామానాయుడు) తెలుగు దేశం మెంబెర్, నేను పార్టీ కి పని చేసాను. అది మా వ్యక్తిగతం. కానీ పరిశ్రమకి వచ్చినప్పుడు నేను ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా నేను పరిశ్రమకి చెందిన వాళ్ళం, అందుకని నేను దానిగురించి మాట్లాడలేను," అని చెప్పారు. నన్ను అడిగితే కనక, చిత్ర పరిశ్రమ రాజకీయాల ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదు అని అనుకుంటున్నాను", అని అన్నారు.