విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు 'బిచ్చగాడు' సినిమాతో. ఈమధ్యనే వచ్చిన 'బిచ్చగాడు 2' కూడా తెలుగులో పెద్ద హిట్ అయింది.పాపం విజయ్ ఆంటోనీ కుటుంబంలో ఆత్మహత్యలు చేసుకునే ఫోబియా వుంది అని కొందరు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. విజయ్ ఏడేళ్లు వున్నప్పుడు అతని తన తండ్రిని పోగొట్టుకున్నాడు. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, ఇప్పుడు అతను తన కుమార్తెను పోగొట్టుకున్నాడు, ఆమె కూడా ఆత్మహత్యే చేసుకుంది. ఈ నేపథ్యంలో మీ కుమార్తె ఇలా పోవటం మనసుకి చాలా బాధ కలిగించింది విజయ్ ఆంటోనీ బ్రదర్. ఇది ఎంత కష్టమో నాకు తెలుసు, మీకు మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, ఇటువంటి కష్ట సమయంలో మీరు చాలా బలంగా ఉండాలి అని ఖుష్బూ ట్వీట్ చేశారు. అలాగే మహత్ రాఘవేంద్ర, జయం రవి, విశాల్, రాఘవ లారెన్స్ సాంఘీక మాధ్యమంలో మెసేజ్ పెడితే, శింబు, లియో చిత్ర నిర్మాత ఇంకా చాలామంది చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులు విజయ్ ఆంటోనీ ఇంటికి వెళ్లి పరామర్శించారు.