భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) గోల్డెన్ టికెట్ అని ఒకటి పెట్టి దేశంలో వున్న అత్యుత్తమ సెలబ్రిటీస్ కి ఈ గోల్డెన్ టికెట్ అందజేస్తోంది. ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న సెలబ్రిటీ దేశంలో జరిగే మ్యాచ్లను విఐపీ గ్యాలరో కూర్చొని తిలకించవచ్చు. వీరికి అన్ని సదుపాయాలు బోర్డు సమకూరుస్తుంది. మొదటి గోల్డెన్ టికెట్ భారత చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్ గా భావించే అమితాబ్ బచ్చన్ అందుకున్నారు. తరువాత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కి అందచేశారు. ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ గోల్డెన్ టికెట్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ కి అందచేసింది. అమితాబ్ తరువాత అందుకున్న నటుడిగా రజినీకాంత్ కి ఈ గౌరవం దక్కింది. బోర్డు సెక్రటరీ జై షా ఈ టికెట్ ని ఈరోజు రజినీకాంత్ కి అందచేశారు.