సింగర్, బిగ్బాస్-14 కంటెస్టెంట్ రాహుల్ వైద్య, బుల్లితెర నటి దిశా పర్మార్ తల్లిదండ్రులయ్యారు. బుధవారం దిశా పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా మా ఇంటికి లక్ష్మీ తల్లి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.